FbTelugu

కనీస రింగ్ టైమ్ పై ట్రాయ్ నిర్ణయం

Troy-Decision-on-Minimum-Ring-Time

న్యూదిల్లీ: మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌‌లైన్స్‌ కు చేసే కాల్స్‌ కు అయితే 60 సెకన్ల పాటూ ఉండాలని ట్రాయ్‌ పేర్కొంది. ట్రాయ్‌ నిర్దేశకాలు జారీచేయడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు.

You might also like