FbTelugu

యాదాద్రి జిల్లాలో కుండపోత వర్షం 

ఓ పక్క రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండగా.. యాదాద్రి జిల్లా వ్యా్ప్తంగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం బీభత్సానికి అనేక చెట్లు నేలకొరిగాయి.

పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినాయి. రేపు లేదా ఎల్లుండి రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

You might also like