FbTelugu

పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు

* అమెరికా నుంచి ఫోన్ లో ట్రిపుల్ తలాక్
* న్యాయం చేయాలంటూ మహిళ ఆవేదన

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాతో కొంతకాలం క్రితం అదివలితో వివాహం జరిగింది. ప్రస్తుతం అది వలి అమెరికాలో ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా అమెరికా నుంచి ఫోన్ చేసిన అదివలి ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ.. న్యాయం చేయాలంటూ సభా ఫాతిమ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. గతంలో ఫోన్ లో చెప్పే ట్రిపుల్ తలాక్ ఆమోదమైనప్పటికీ.. ఇటీవల భారత ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను పలు ఆంక్షలతో నిషేధించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.