FbTelugu

రైలులో నెల ప్రయాణం కేవలం 25 రూపాయలే !

Traveling-by-train-for-just-Rs-25-a-month

రోజువారి కూలీలకు ఓ శుభవార్త.. కేవలం రూ.25 చెల్లించి నెలరోజుల పాటు ఏ ట్రైనులోనైనా ప్రయాణం చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన ‘ఇజ్జత్ పాసు’లను పొందాల్సి ఉంటుంది. ఈ పాసులను రైల్వేశాఖ ఇస్తుంది. పాసులను రోజువారి కూలి పనులు చేసుకునేవారికి ఇస్తారు. రానుపోను 300 కిలోమీటర్ల వరకు ఏ ట్రైన్‌లో అయినా (ఫ్యాసింజర్, సూపర్ ఫాస్ట్) ప్రయాణం చేయవచ్చు. వీటిని ట్రైన్‌లలో చిరు వ్యాపారులు పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు, పల్లీలు, రోజువారి పనులు చేసుకునే సుతారి, పెయింటింగ్, ఇతరత్ర కూలీపనులకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఇజ్జత్ పాసులు పొందవచ్చు వారికి రైల్వేశాఖ పాసులు అందింస్తుంది. పాస్ కావాలనుకునే వారు తెల్ల రేషన్ కార్డు, తహసీల్దార్ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్‌, గ్రామ సర్పంచ్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని పార్లమెంట్ సభ్యుడి క్యాంపు కార్యాలయానికి రావాలి. అక్కడ కార్యాలయ సిబ్బంది దరఖాస్తును ఇస్తారు. అది పూర్తి చేసి రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించి ఇచ్చినైట్లెతే వాటిని పరిశీలించి పార్లమెంట్ సభ్యుడు తన లెటర్ హెడ్ మీద సర్టిఫికేట్ అందజేస్తారు. దీనిని కూలీలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

You might also like