FbTelugu

విమానంలో ప్రయాణం… నీలం తిమింగలం ఫొటో వైరల్!

కాలిఫోర్నియా: ఫొటోలు తీయడం హాబీగా గా మారడంతో పలువురు తమకు నచ్చిన, మెచ్చిన ఫొటోలు తీస్తున్నారు. అలా తీసిన కొన్ని ఫొటోలను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అమెరికాకు చెందిన జస్మిన్ చిల్డ్రెస్ అనే మహిళ విమానంలో ప్రయాణిస్తూ తిమింగలాన్ని సముద్రంలో చూసింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న శాంటా బార్బారా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో తిమింగలం కన్పించింది. ఇంకేముంది సముద్రంలోని భారీ తిమింగలాన్ని తన కెమెరాలో బంధించింది. అబ్బురపరిచే విధంగా ఉండడంతో వీటిని తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసిన పలువురు బాగున్నాయంటూ కితాబునిచ్చారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది లైక్ కొట్టారు.
నీలం రంగు తిమింగలాలు రెండు బస్సుల సైజులో ఉంటాయని, విమానంలో ప్రయాణిస్తున్నా ఇవి కంటికి స్పష్టంగా కనిపిస్తాయని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. కంటికి కన్పించినా ఫొటో తీయడం ఒక ఆర్ట్ అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. గతంలో తను కూడా విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంగా తిమింగలాన్ని చూశానని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.