FbTelugu

రష్మిక కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం

తమకు నచ్చిన సినిమా హీరో, హీరోయిన్ల కోసం అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. వారితో కలిసి మాట్లాడేండుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి కోవలోని ఒక అభిమాని హీరోయిన్ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాడు.
తీరా ఆమె తన స్వంత గ్రామంలో లేదని తెలియడంతో నిరాశకు గురయ్యాడు. రష్మిక మందన్న అభిమాని ఒకరు ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించుకున్నాడు.

తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి కలుసుకునేందుకు గూగుల్ లో సెర్చి చేసి ఆమె స్వస్థలం కనుక్కున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు సమీపంలోని విరాజ్ పేట అని గుర్తించాడు. హైదరాబాద్ నుంచి రైలులో మైసూర్ వెళ్లాడు. అక్కడి నుంచి గూడ్స్ ఆట్రో ట్రాలీలో విరాజ్ పేట చేరుకున్నాడు. కన్పించిన ప్రతి ఒక్కరిని రష్మిక ఇళ్లు ఎక్కడ అని అడిగాడు. అతని ప్రవర్తన తేడాగా ఉండడం, కన్నడ భాష తెలియకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారించి, తిరిగి హైదరాబాద్ పంపించారు. రష్మిక విరాజ్ పేటలో లేదని, షూటింగ్ కోసం ముంబయి వెళ్లిందని చెప్పి పంపించారు. ఆకాశ్ ఆమె కోసం 900 కిలోమీటర్లు ప్రయాణించడం కొసమెరుపు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.