FbTelugu

లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. 25 మందికి గాయాలు

తూ.గో. జిల్లా: రాజానగరం మండలం దివాన్ చెరువు సమీపంలో ఓ కంటెయినర్‌ను లారీ ఢీకొట్టగా.. అదే సమయంలో విశాఖట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది. మరోవైపు, కంటెయినర్‌ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి హాహాకారాలు చేశాడు. ప్రయాణీకులు అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. గాయపడిన ప్రయాణకులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ట్రావెల్స్ బస్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.