FbTelugu

విద్యార్థులకు ట్రావెల్ అలవెన్సులు

Travel-allowances-for-students

ప్రభుత్వ బడులలో చదువుతూ.. బస్సు సౌకర్యం లేని విద్యార్థులకు ప్రభుత్వం టీఏ(ట్రావెల్ అలవెన్స్) కల్పించనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం నాణ్యమైన ఉచిత విద్య, అన్ని సౌకర్యాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2019-20 విద్యా సంవత్సరానికి బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం అందించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి చదివేవారికి నెలకు రూ.400, ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు రూ.600 అందించనున్నారు. ఈ డబ్బును నేరుగా విద్యార్థి అకౌంటులో వేయనున్నారు.

You might also like