FbTelugu

భారత్ బంద్ తో స్థంభించిన రవాణా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ తలపెట్టిన భారత్ బంద్ లో రైతులు పెద్ద ఎత్తున పాల్లొన్నారు. ఈ బంద్ కు వివిధ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయవంతం అయ్యింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకునేందుకు పట్టాలపై పడుకున్నారు. బనారస్ నుంచి బందేల్ ఖండ్ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాగ్ రాజ్ నగరంలో కార్యకర్తలు ఆపేశారు. రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో రైతులు, ఎన్ఎస్ యూఐ కు చెందిన విద్యార్థులు బీజేపీ కార్యాలయం ముందు ఘెరావ్ చేశారు. ఒడిశా లోని భువనేశ్వర్ స్టేషన్ లో పలు రైళ్లను నిలిపివేశారు.

రవాణా సంఘాలు కూడా ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో సరకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. మహారాష్ట్రలోని పుణే మార్కెట్ తెరిచినా, వ్యాపారులు వస్తువులు విక్రయించకుండా రైతులకు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రధాన మార్కెట్లు మూతపడ్డాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.