FbTelugu

ట్రాన్స్ ఫార్మర్ పేలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

పశ్చిమగోదావరి: ట్రాన్స్ ఫార్మర్ పేలి ఓ వ్యకి మృతి చెంది నలుగురికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని వీరవాసరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వీరవాసపురంలోని స్థానిక పోతురాజు గుడి సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదవ శాత్తు పేలింది.

ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలైనాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.

You might also like