FbTelugu

కర్నూలు కమిషనర్ పై వేటు

ఐఏఎస్ అధికారి బాలాజీ నియామకం

కర్నూలు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడం, నియంత్రణా చర్యల్లో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్, ఐఏఎస్ అధికారి డీకే. బాలాజీ ని కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా నియమించింది. అక్కడ పనిచేస్తున్న రవీంద్రబాబుపై వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

You might also like