FbTelugu

జగన్ తో ట్రైనీ ఐఏఎస్‌ల భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రెడ్డితో ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ట్రైనీ ఐఏఎస్‌లు సమావేశమయ్యారు.

ముస్సోరీలో రెండో విడత శిక్షణ కార్యక్రమం కోవిడ్‌ కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. దీంతో ట్రైనీ ఐఏఎస్‌లకు శాఖల కేటాయింపులు చేశారు. సంబంధిత శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ట్రైనీ ఐఏఎస్‌లు ఈ కాలాన్ని వినియోగించుకున్నారు.

ఆ శాఖలపై ప్రజంటేషన్లు తయారు చేశారు. ఎంపిక చేసిన వాటిపై సీఎం కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ప్రజంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్‌ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించి, వారిని శాలువాలతో సత్కరించారు.

తమకు కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవాలని, అనుభవం సంపాదించాలని ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి సీఎం అన్నారు. ప్రతి వ్యవస్థలో కూడా లోపాలు కనిపిస్తుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగులు వేసి వాటిని దృఢంగా తీర్చిద్దాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారని, వారి మార్గ నిర్దేశం తీసుకోవాలని జగన్ రెడ్డి సూచించారు.

You might also like