FbTelugu

నేటి నుంచి రైళ్ల రాకపోకలు షురూ

న్యూఢిల్లి: నేటి నుంచి దేశంలో పలు రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నుంచి ముఖ్య నగరాలకు ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అయితే కరోనా లక్షణాలు లేని వారికే రైళ్లలోకి అనుమతిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

ఈ నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. కేంద్రం రైళ్లను నడిపి రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ పాటించాలనం విడ్డూరంగా ఉందని అన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించవద్దని సూచించారు.

You might also like