FbTelugu

రైల్వేట్రాక్ పై ఆగిపోయిన కారు.. ఈడ్చుకెళ్లిన గూడ్స్

కడప: రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోవడంతో గూడ్స్ రైలు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి చెంది మరొకరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని వై.కోడూరు దగ్గర చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఓ కారు రైల్వే ట్రాక్ ను క్రాస్ చేస్తుండగా అనుకోకుండా కారు ఆగిపోయింది. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వచ్చి ఆ కారును బలంగా ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ఉన్న నాగిరెడ్డి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

You might also like