FbTelugu

తిరుమలలో విషాదం

తిరుమల: కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందుతున్న టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసచార్యులు(45) మృతి చెందారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం నుండి డిప్యుటేషన్ పై శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నారు.

పాజటివ్ తేలడంతో వారం రోజుల క్రితం శ్రీనివాసచార్యులు తిరుపతిలోని స్విమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం చనిపోయారు. అయితే శ్రీనివాసచార్యులు మృతిని అధికారికంగా టీటీడీ ఇంకా దృవీకరించలేదు.

You might also like