FbTelugu

మహబూబాబాద్ జిల్లాలో విషాదం

మహబూబాబాద్: శనిగపురం తుమ్మల చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. సెలవులు కావడంతో చెరువు వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.

నలుగురు చిన్నారులు శనిగపురం గ్రామం బోధతండాకి చెందినవారు. మృతులు ఇస్లావత్ లోకేష్ (10), ఇస్లావత్ ఆకాష్ (12), బొడా దినేష్ (10), బోడా జగన్ (14). తల్లిదండ్రులు పనులకు వెళ్లడం, పాఠశాలలు లేకపోవడంతో నలుగురు కలిసి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పంచనామా చేశారు.

You might also like