FbTelugu

గోల్నాకలో గోడకూలి ఐదుగురు మృతి

Tragedy-in-Golnaka-three-dead

హైదరాబాద్: అంబర్ పేట్ లోని గోల్నాకలో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఫెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి జరుగుతుండగానే ఈ దుర్ఘటన జరిగింది. రెండు ఆటోలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. 10 టూ వీలర్ లు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది.

You might also like