FbTelugu

ట్రీట్ మెంట్ లోనూ సంప్రదాయమేనా?

తిరుమల: కరోనా ట్రీట్ మెంటులో ప్రాణాల కన్నా సంప్రదాయాలకే విలువ ఇస్తున్నారు. తిరుమలలో సుమారు 18 మంది అర్చకులకు కరోనా సోకింది.

ఆలయ పెద్ద జీయంగార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు లోని చెన్నై అపోలో హాస్పిటల్ తరలించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే ఆయన వైద్యానికి చాతుర్మాస దీక్ష అడ్డు వచ్చింది. దీక్ష తీసుకున్నవారు పొలిమెరలు దాటి వెళ్లకూడదనే నిబంధన ఉంది. దీంతో ఆలయ అధికారులు తర్జనభర్జనల తరువాత తిరుమలలోనే చికిత్స చేయించాలని నిర్ణయించారు.

పద్మావతి కరోనా సెంటర్ కు పెద్ద జీయంగార్ ను తరలించారు. దీక్షలో ఉండడంతో ఆయను మఠానికి తరలించి, అక్కడే వైద్యం అందించనున్నరు. అయితే జీయంగార్ కు సేవలు అందించేందుకు శిష్యులు ముందుకు వచ్చారు. వారి నుంచి టీటీడీ అఫిడవిట్లను తీసుకుంటున్నది.

You might also like