FbTelugu

బాలున్ని బలిగొన్న ట్రాక్టర్

నల్లగొండ: సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన జిల్లాలోని శాలిగౌరారం మండలం, ఆకారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వినయ్‌ కుమార్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి పంచాయతీ ట్రాక్టర్‌పై సరదాగా ఆడుకుంటు ఉండగా..

డ్రైవర్ వారిని దిగమని చెప్పి ట్రాక్టర్ ను ముందుకు కదిలించడంతో ప్రమాదవశాత్తూ ఆ బాలుడు ట్రాక్టర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని బాలుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.