FbTelugu

కరోనా దెబ్బకు ట్రాక్టర్ల సేల్స్ జూమ్

ఢిల్లీ: కరోనా దెబ్బతో రెండు మూడు రంగాలు మినహా అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. అయితే ట్రాక్టర్ల పరిశ్రమకు మాత్రం మంచే జరిగిందంటున్నారు. పట్టణాల్లో పనిచేస్తున్న యువత గ్రామలకు వెళ్లడంతో వ్యవసాయం ఊపందుకున్నది.

వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్ అవసరం ఉండడంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. దేశీయ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 27 శాతం పెరిగాయి. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాలు పెరగడంతో, డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచారు. అయితే ఆటో డివిజన్ ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాల విక్రయాలు అంతగా లేవు.
పట్టణాల్లో ఉద్యోగాలు కోల్పోవడం, వర్క్ ఫ్రం హోం అవకాశాలు ఉండడంతో పెద్ద ఎత్తున గ్రామాలకు తరలివెళ్లారు. విద్యావంతులు పొలం బాట పట్టడడంతో పైర్లు పచ్చగా కళకళలాడుతున్నాయి.

You might also like