FbTelugu

తెలంగాణ దొంగల పాలైంది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే… ఇవాళ దొంగల పాలైందని పిసిసి నూతన అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛ, ఆకాంక్షల కోసం కోట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఇవాళ ములుగు నుంచి జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ర్యాలీగా బయలుదేరి వచ్చింది. సమ్మక్క సారాలమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె హైదరాబాద్ కు భారీ ర్యాలీతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కెసిఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకున్నదని, విముక్తి కల్పించడమే తన ఏకైక లక్ష్యమన్నారు.

స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయకపోవడంతో వారు బ్రోకర్లుగా అవతారమెత్తారన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గౌరవంగా బతకాలంటే టిఆర్ఎస్ పాలన అంతం కావాలన్నారు. తనకు పిసిసి చీఫ్ పదవి ఇస్తున్నారని ఇంటెలీజెన్స్ చెప్పగానే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయని అన్నారు. తెలంగాణ తల్లీని బంధ విముక్తి చేయడానికి సోనియాగాంధీ తనకు పదవి ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, కార్యకర్తల కోరిక మేరకే రేవంత్ కు పదవి లభించిందన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, 2023లో అధికారంలోకి వస్తుందని సీతక్క ధీమా వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.