FbTelugu

తౌక్టే తుఫాన్… కొట్టుకుపోయిన రెండు నౌకలు!

ముంబయి: తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో భీభత్సం సృష్టిస్తున్నది. అతి భీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తున్నది.

తుఫాన్ ధాటికి బాంబే హై ప్రాంతంలో తీరం వద్ద నిలిపి ఉణ్న బార్జ్ ల యాంకర్లు తొలగిపోయాయి. తీవ్రమైన అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. వీటిలో సుమారు 410 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన నేవీ అధికారులు వారిని రక్షించడం కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. రెండింటిలో ఒక బార్జ్ ఒ.ఎన్.జి.సి సంస్థకు చెందినది. మరో బార్జ్ ముంబయి తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయింది. ఇందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. తుఫాను కు ముందు ఈ రెండింటికి యాంకర్లు వేసినప్పటికీ అలల ధాటికి ఊడిపోయాయి. తుఫాన్ కారణంగా ముంబయిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముంబయి ఏయిర్ పోర్టులో తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు.

కేరళ రాష్ట్రంలో తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలోని ఇళ్లు చాలా ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాలకు అనేక డ్యామ్ లు నిండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటకలోని ఏడు జిల్లాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉంది. ఇళ్లు కూలడంతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పొరుగున ఉన్న గోవాలో కూడా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.