FbTelugu

తుఫాన్‌ అలర్ట్‌.!

హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో ‘తౌక్టే’ వాయుగుండం దూసుకొస్తున్నది. ఈనెల 16వ తేదీ నాటికి తుపాన్‌గా రూపాంతరం చెందనున్నదని వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు.

ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. గుజరాత్‌ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తెలంగాణ, ఏపి రాష్ట్రంపై ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాయలసీమకు మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల రాక శుభ సంకేతమని వాతావరణ శాఖ ఒకప్పుడు తేలిపేది. అకాల వర్షాలు నష్టాలు కలుగచేస్తాయంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.