FbTelugu

ఒడిశాలో టోటల్ లాక్ డౌన్

భువనేశ్వర్: కరోనా విలయం ఇప్పట్లో ఆగే సూచనలు లేకపోవడంతో సిఎం నవీన్ పట్నాయక్ అప్రమత్తమయ్యారు. గడచిన 24 గంటల వ్యవధిలో 10వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కట్టడికి లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని భావించిన నవీన్ పట్నాయక్ మే 5వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మెడికల్ సర్వీసులు, ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని మూసి ఉంటాయని, ప్రజలు పరిస్థితి అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నదని, వైరస్ చైన్ ను నిలువరించేందుకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ లో కూడా అక్కడి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.