FbTelugu

ప్రియునికి దగ్గరై.. కూతురికి చిత్రహింసలు!

అనంతపురం: ప్రియునికి దగ్గరైన ఓ మహిళ తన కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన జిల్లాలోని కదిరిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త నుంచి విడిపోయి మరో ప్రియుని మోజులో పడ్డ ఓ మహిళ తన కూతురికి ఒళ్లంతా వాతలు పెట్టింది. మొదటి భర్తపై కోపంతో చిన్నారిని చిత్రహింసలు పెడుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like