FbTelugu

ఆంధ్రా వర్సిటీ లో అగ్రవర్ణ ఆధిపత్యం: అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం: ఇదెక్కడి రాజ్యం.. అగ్రవర్ణ పెత్తందార్ల అధిపత్యంలో దళిత, బడుగు బలహీన, వెనుకబడిన వర్గాలు హక్కులు కోల్పోతున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీలో రెడ్డి ఉప కులపతి ఆధ్వర్యంలో కుల వివక్ష దారుణంగా ఉందన్నారు. ఒక దళిత విద్యార్థి తన పి.హెచ్.డి ని సమర్పించకుండా తన ఫైల్ ని గత రెండు నెలల నుంచి తొక్కిపెట్టిన ఉప కులపతి రెడ్డి అధికార దుర్వినియోగం దారుణమన్నారు. వైసీపీ పార్టీ కార్యక్రమాలు, నాయకుల జన్మదిన వేడుకలు, రాజకీయ చర్చలు, స్థానిక ఎన్నికల అభ్యర్థులతో మాటా మంతి వంటి వాటికి యూనివర్సిటీ నిలయంగా మారిందన్నారు.

పరిశోధనలు బ్రష్టు పట్టించారు. ఒక దళిత విద్యార్థి ఉన్నతంగా ఎదగడం మీకు ఇష్టం లేక ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులలో భాగంగా ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో దళిత విద్యార్థిపై దాడా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆ విద్యార్థికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.

You might also like