FbTelugu

టెన్త్ పరీక్షలపై రేపు సీఎం సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించాలా, లేక రద్దు చేయాలా అన్న అంశంపై సమాలోచనలు చేయనున్నారు. ఒకవేళ గ్రేడింగ్ అమలు చేస్తే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై కూడా చర్చ జరుపనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.