FbTelugu

రేపు 6వ విడత హరితహారం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపు (గురువారం) ఆరోవిడత హరితహారం ప్రారంభం కానుంది. నర్సాపూర్ లో హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సనత్ నగర్ లో మంత్రి కేటీఆర్ హరితహారాన్ని ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా 30 కోట్లకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు కచ్చితంగా నాటించాలని అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.