FbTelugu

రేపు, ఎల్లుండి కోస్తా, సీమల్లో భారీ వర్షాలు

అమరావతి: నివర్ తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం మరవక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ విభాగం వెల్లడించింది.

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది. డిసెంబర్ 2న వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.