FbTelugu

టమాట రైతులు నిరసన

కృష్ణా: కష్టం చేసిన పండించిన టమాటకు కనీస ధర దక్కకపోవడంతో ఆగ్రహించిన రైతులు కృష్టా నదిలో పారబోసి నిరసన తెలిపారు.
కిలో టమాటా మార్కెట్లో రూ.15 పలుకుతుండగా రైతుకు మాత్రం రూ.2 కూడా దక్కడం లేదు. కనీస మద్దతు ధర లభించడం లేదని ఆగ్రహానికి గురైన కోసూరువారిపాలెం, నాగాయితిప్ప, మో పిదేవిలంక గ్రామాల రైతులు పంటను కృష్ణానదిలో పారబోశారు.

టమాట పండించేందుకు ఎకరాకు రూ.80 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, కేజీ రూ.2కు అడుగుతుంటే ఏం చేయాలని నిలదీశారు. విక్రయిస్తే కనీసం కోత కూలి ఖర్చులు కూడా రావడం లేదని, తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలుసుకున్న మార్కెటింగ్‌ శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పి.రామాంజనేయులు స్పందించారు. ఆయన మంగళవారం సాయంత్రం కోసూరువారిపాలెంలో పర్యటించి వివరాలు సేకరించారు. టమాట పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చి శాంతింప చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.