FbTelugu

మహిళ అయితే పెళ్లి చేసుకోవాలా?

టాలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లంటే ఇష్టం లేనట్లుగా ఉంది. మాతృత్వం మధుర క్షణాలు అనుభవించాలని లేదేమో… ఎవరైనా పెళ్లి మాటెత్తితే రబ్బర్ బంతిలా ఎగిరి మాట్లాడుతున్నది.

ఈ మధ్య తెలుగు సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తూ మంచి పేరు సంపాదించుకున్నది. తమిళ ప్రేక్షకులు ఆదరించకపోయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం దగ్గరైంది. తాజాగా ఆమె తన 36వ పుట్టిన రోజు వేడుకలు అనాధ పిల్లల మధ్య జరుపుకున్నది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. అనాథ పిల్లల మధ్య జన్మదినం వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ఒక మీడియా ప్రతినిధి పెళ్లెప్పుడు చేసుకుంటున్నారని ప్రస్తావించగా, ఇదేం ప్రశ్న అంటూ భగ్గుమన్నది. పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళగా పుడితే పెళ్లి చేసుకోవాలని ఏమైనా షరతు ఉందా అని ప్రశ్నించింది. ఆడది పెళ్లి చేసుకుంటేనే పరిపూర్ణ మహిళ అవుతుందా అంటూ ఎదురు ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.