FbTelugu

డ్రగ్స్ లేకుండా పార్టీలు చేసుకోరా?

హైదరాబాద్: బాలీవుడ్, శాండల్ వుడ్ మాదిరే డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ లో పార్టీలే ఉండవని నటి మాధవీలత బాంబు పేల్చింది. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని, దీని నార్కోటిక్స్ అధికారులు దృష్టి సారించాలని సోషల్ మీడియాలో కోరింది.

గత దశాబ్ధకలంగా డ్రగ్స్ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందని, కోలీవుడ్ పై కూడా ఓ కన్నేయాలని ఆమె కోరింది. బాలీవుడ్ లో మత్తు మామూలేనంటూ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనకు తెలిసిన ఒక ప్రముఖ హీరో డ్రగ్స్ వాడేవాడని, తను గురువుగా భావించే డైరెక్టర్ డ్రగ్స్ రుచి చూపించాడని తెలిపింది. పది ఇరవై మంది కానది ఏకంగా 90 శాతం మంది డ్రగ్స్ కు బానిసలని, అది లేకుండా పార్టీలు ఉండవని కంగనా బట్టబయలు చేసింది.

You might also like