FbTelugu

ఓఎల్ఎక్స్ లో ఆర్మీ వెహికల్స్ అంటూ టోకరా

విజయవాడ: ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ఆర్మీ వెహికల్స్ అంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు దుండగులు ఓఎల్ఎక్స్ లో ఆర్మీ వెహికల్స్ అంటూ ప్రకటించారు.

నకిలీ ఆర్మీఐడీ కార్డులను, వెహికల్ పత్రాలను సైతం సృష్టించారు. ఇది నిజమే అని నమ్మిన ఓ వ్యక్తి వారికి గూగుల్ పే ద్వారా రూ.30,500 వారి అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేశారు. చివరికి ఇదంతా మొసమని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

You might also like