FbTelugu

ఐటెంసాంగ్ లో అవకాశమంటూ యువతికి టోకరా

విశాఖపట్నం: ఓ యువతికి సినిమాలో ఐటెం సాంగ్ కు అవకాశం కల్పిస్తానంటూ.. ఓ వ్యక్తి ఏకంగా రూ.5 లక్షలకు టోకరా వేసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ యువతి (జూనియర్ ఆర్టిస్టు)తో గీతా ప్రసాద్ (నిందితుడు) అనే వ్యక్తి సినిమాలో ఐటెం సాంగ్ కు అవకాశం కల్పిస్తానని నమ్మబలికాడు.

ఇందుకు రూ.10 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇప్పిస్తానని తెలిపి దానికి బదులుగా తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని ఆఫర్ ఇచ్చాడు. నిజమేనని నమ్మి రూ.5 లక్షలు ఇచ్చింది. కానీ ఎంతకీ అవకాశం కల్పిచకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like