FbTelugu

కరోనా సాయం పేరుతో 45 లక్షలకు టోకరా

హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా సైబర్ నేరగాళ్లు తమ నేరాల్లో కరోనాను కూడా వాడేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలను తాజాగా సైబర్ క్రైం ఏసీపీ వెల్లడించారు. నగరంలోని ఓ చర్చ్ ఫాదర్ కు సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కెనడియన్ తాను కరోనా సాయాన్ని పంపుతున్నట్టు పేర్కొన్నాడు.

అదేసమయంలో కస్టమ్స్ డిపార్ట్ మెంట్ నుంచి అంటూ ఓ లేడీ ఫోన్ చేసి మీకు ఓ పార్సిల్ వచ్చింది. ట్యాక్స్ రూ.24,700 కట్టాలంటూ చెప్పడంతో నిజమేనని నమ్మిన అతడు కట్టేశాడు. ఆ తర్వాత మరో ఫోన్ కాల్ వచ్చింది. పార్సిల్ లో యూఎస్ డాలర్స్ ఉన్నాయని అది నేరం కాబట్టి కేసు అవుతుందని పెద్దమొత్తంలో కట్టాలని తెలిపింది. దీంతో ఆ మొత్తాన్ని కూడా కట్టేశాడు. ఆ తర్వాత ఇన్ కం ట్యాక్స్, ఇన్సూరెన్స్, మనీలాండరింగ్ చార్జెస్, ఆర్బీఐ చార్జెస్ అంటూ సుమారు రూ.45 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరికి మోసాపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.