హైరాబాద్: సైబర్ మోసార్ రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. కేటుగాళ్లు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా.. నగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఆన్ లైన్ లో మాస్కులు, శానిటైజర్ల అమ్మకం పేరుతో ఓ ట్రస్టును నమ్మించి ఏకంగా రూ.24 లక్షలు దండుకున్నారు. మాస్కులు, శానిటైజర్లు పంపిస్తామంటూ.. విడతల వారీగా డబ్బును తమ ఖాతాలో వేయించుకున్నారు. చివరకు తాము మోసపోయామని గుర్తించిన ట్రస్టు యాజమాన్యం సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియన్ బెంజిమన్ ను అరెస్టు చేశారు.