FbTelugu

కల్లు తాగిన త్రాచుపాము..!

toddy-drunken-snake

కల్లు తాగిన కోతి గురించి వినే ఉంటారు. కానీ కల్లు తాగిన పాము గురించి ఎప్పుడైనా విన్నారా.. ఓ త్రాచుపాము కల్లు తాగి ఏకంగా అదే కుండలో పడుకుంది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… పంజాల కొమరయ్య అనే గీత కార్మికుడు ఎప్పటిలాగే కల్లు తీసేందుకు చెట్టుపై ఉన్న కుండను తీశాడు… అంతే.. బుసలు కొడుతున్న శబ్దం ఎక్కువైంది ఆశ్చర్యపోయిన కొమరయ్య శబ్దం ఎక్కడా అని చూడగా అది కుండలోనే అని తెలుసుకొని తొంగి చూడగా అసలు విషయం బయటపడింది. కుండలో ఓ భారీ పాము ఉన్నట్టు గుర్తించాడు. తర్వాత దాన్ని పక్కకు పొదల్లోకి వదిలేశారు.

You might also like