FbTelugu

తెలుగు జాతికి ఇవాళ పండగ రోజు : బాలకృష్ణ

హైదరాబాద్: తెలుగు జాతికి ఇవాళ పండగ రోజని సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ దంపతులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం పొంగుతుందని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సినీ పరిశ్రమ పుంజుకోవడానికి ఇంకా టైం పడుతుందని అన్నారు.

త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుంది…

మహానాడు విజయవంతంగా జరుగుతున్నందుకు బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ అంటే నటనాలయం అని, తెలుగుదేశం స్థాపించి పేదలకు పట్టెడన్నం పెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించారు.

ఎన్టీఆర్ నాకు దైవంతో సమానమని కొనియాడారు. ఎన్టీఆర్, చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాలు తీర్చారు. తెలుగుదేశం కార్యకర్తల రుణం తీర్చుకోలేమన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. ఐదేళ్లు అవసరం లేదు.. త్వరలోనే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరికీ భయపడొద్దని,  నిత్యం అందుబాటులో ఉంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

You might also like