హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టు తెలిపింది.
ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశమంతటా వ్యాపించాయి. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.