FbTelugu

నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. నేడు తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపారు..

జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి వరంగల్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీమ్, అదిలాబాద్, నిర్మల్ లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

You might also like