FbTelugu

నేడు, రేపు తెలంగాణలో తీవ్ర ఎండలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై బాణుడు బగబగమంటున్నాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతోంది. రాష్ట్రంలో నేడు రేపు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ముఖ్యంగా అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లలో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు సాధ్యమైనంత వరకు బయట తిరగవద్దని సూచించింది.

You might also like