హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు రాయలసీమలో, ఎల్లుండి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రెండ్రోజుల పాటూ తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.