FbTelugu

వెస్టిండీస్ సీరిస్ జట్టు ఎంపిక నేడే

కోల్‌కతా: వచ్చేనెల 6 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఇండియా టీమ్ ను ఇవాళ ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపికలో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఫామ్‌లో లేని ధవన్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకునే చాన్సుంది. ఎప్పటి నుంచో ఆడుతున్న రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. నేషనల్ సెలెక్ట్ కమిటీ సమావేశానికి ఎమ్మెస్కే ప్రసాద్ ఈరోజు చివరి సారిగా కూర్చోనున్నారు.

You might also like