FbTelugu

లా సెక్రెటరీ స్వచ్ఛంద పదవీవిరమణ

/Today-the-Law-Secretary-retires-voluntarily

హైదరాబాద్: న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న వి. నిరంజన్ రావు నేడు ఆ పదవి నుంచి స్వచ్ఛంద పదవీవిరమణ చేయనున్నారు. దీనికి సంబంధించిన లేఖను సాధారణ పరిపాలన శాఖకు పంపారు. విధుల నుంచి ఆయనను రిలీవ్ చేస్తూ ఇవాళ జీఏడీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జనవరి 31, 2020 వరకు నిరంజన్ రావు పదవీకాలం ఉన్నప్పటికీ.. ఆయన 3 నెలల ముందే అంటే అక్టోబర్ 31, 2019 నే స్వచ్ఛంద పదవీ విరమణ పొందుతున్నారు. ఇతనిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా.

న్యాయశాఖ కార్యదర్శి పదవి కాళీ అవుతున్న నేపథ్యంలో ఇంఛార్జ్ సెక్రెటరీ కోసం కొత్త ప్రతిపాదన హైకోర్టు రిజిస్ట్రార్ పంపనున్నారు. ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశాలున్న నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాటును ప్రభుత్వం చేయనుంది. లా సెక్రెటరీగా అదే శాఖలోని అధికారికి అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

You might also like