FbTelugu

నేడు మరో భారీ ఆందోళనకు బీజేపీ పిలుపు

అమరావతి: రామతీర్థం ఘటన వివాదం ఏపీలో దుమారం రేపుతూనే ఉంది. రామతీర్థం ఘటనను వ్యతిరేకిస్తూ.. నిన్న బీజేపీ, జనసేనలు తలపెట్టిన ధర్మయాత్ర నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై దాడి జరిగిందని, అలాగే పార్టీ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని అందుకు నిరసనగా.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మరో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చింది.

తమను రామతీర్థం ఆలయంలోకి బేషరతుగా అనుమతించాలని డిమాండ్ చేసింది. నేటి ఆందోళనలో భాగంగా.. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు, ఆర్డీఓ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించనున్నట్టు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.