FbTelugu

నేడు ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ రెండో విడత షురూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం రెండో విడతను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి నేత కార్మికునికి (మగ్గం ఉండాలి) రూ.24 వేలు నగదు పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలకుకోసం ప్రభుత్వం రూ.194.46 కోట్లు పంపిణీ చేయనుంది. కరోనా నేపథ్యంలో ఆరునెలల ముందే సాయం అందిస్తున్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.