FbTelugu

నేడు చివరి పంచాయతీ ఎన్నికలు

అమరావతి: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ కొనసాగనున్నది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిస్తారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇవాళ ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక జరగనున్నది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ విడతలో 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవం అయ్యారు. రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు, మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈ విడతలో 67,75,226 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బంది నియామకం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.