FbTelugu

రోహిత్ సారధ్యంలో నేడు బంగ్లాతో ఢీ

Today-is-the-first-T20-with-Bangladesh-under-Rohit

నేడు టీమ్ఇండియా రోహిత్ శర్మ సారధ్యంలో బంగ్లాదేశ్ పై తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి ప్రారంభం కానుంది. కాగా భారత్ టీంలో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి ఓపెనర్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలిచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నిషేధం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనున్నాయి.

You might also like