న్యూఢిల్లీ: తాజా భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఇవాళ సాయంత్రం 5:00 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్ , చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న పలు పార్టీల అధినేతల జాబితా కింది విధంగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కేసీఆర్
తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అకాలీదళ్ నుంచి సుఖ్బీర్ సింగ్ బాదల్
లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్
తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ
శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే
ఎన్సీపీ నుంచి శరద్ పవార్
సీపీఐ(ఎం) నుంచి సీతారాం ఏచూరి
సీపీఐ నుంచి డి. రాజా
జేడీయూ నుంచి నితీశ్ కుమార్.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
Next Post
You might also like