FbTelugu

నేడు కృష్ణారివర్ బోర్డు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 203, నిర్మించతలపెట్టిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ మొదలైంది. శ్రీశైలం నీటి మల్లింపు అక్రమమని, ఏపీలో కొత్త ఎత్తిపోతల పథకాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తమ వాటా నీళ్లే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అదనంగా ఒక్క చుక్క నీటిని కూడా వాడుకోబోమని తెలిపిందే ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణా రివర్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది.

You might also like